![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో మొన్నటి వరకు కెప్టెన్సీ టాస్క్ లు జరుగగా అందులో డీమాన్ పవన్ గెలిచి కొత్త కెప్టెన్ అయ్యాడు. అయితే డీమాన్ కెప్టెన్ అవ్వాలని తనకే రీతూ సపోర్ట్ చేసిందని బిగ్ బాస్ ఆడియన్స్ అందరికి తెలుసు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో.. పర్మినెంట్ ఓనర్ అవ్వటానికి ఏడుగురు రెంటర్స్ కి టాస్క్ ఇస్తున్నాడు బిగ్ బాస్. గతవారం భరణి పర్మినెంట్ ఓనర్ అయ్యాడు. ఈ వారం టాస్క్ లో గెలిచి రాము రాథోడ్ పర్మినెంట్ ఓనర్ అయ్యాడు.
టాస్క్ లో అందరు బాగా ఆడారు.ఇక చివరగా ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ ఉండగా.. హౌస్ అంతా ఇమ్మాన్యుయల్ కి సపోర్ట్ చేయగా.. ఒక్క రీతు మాత్రం డీమాన్ పవన్ కి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత రీతూ ఓ దగ్గర కూర్చొని ఉంటే తన దగ్గరికి ప్రియ వస్తుంది. నువ్వు కావాలనే డీమాన్‌కి ఇచ్చావని బయటికి ఏమనలేదు కదా అని అంటూ రీతూని ప్రియ అడిగింది. వీళ్లిద్దరు ఆడారు కదా గేమ్.. దాన్ని బట్టే నేను ఇచ్చాను కదా.. అంటూ రీతూ తనని తాను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడింది. ఇంతలో ఇద్దరు కలిసి నా మీద ఎటాక్ చేశారు.. రెండో విషయం ఇమ్మూ అసలు డిఫెండ్ లోనే ఉన్నాడు ఎటాక్ చేయలేదు.. ఆ ప్లేట్ పక్కనే కూర్చున్నాడంటూ డీమాన్ మాట్లాడాడు. మరోవైపు మర్యాద మనీష్ కూడా కామనర్లతో కెప్టెన్సీ గేమ్ గురించి చర్చించాడు. నేను ప్లేట్ తన్నడానికి రీజన్ అదే.. ఆయన మనీష్‌ని ఎటాక్ చేయని అన్నాడు.. అప్పుడు మేమిద్దరం ఏమనుకున్నామంటే భరణిని ఎటాక్ చేద్దామని అనుకున్నామని మనీష్ చెప్పాడు. భరణి గారు అన్‌ఫెయిర్ ఆడుతున్నారని క్లియర్‌గా తెలుస్తుందంటూ ప్రియ మధ్యలో మాట్లాడింది. ఇమ్మాన్యుయల్ కూడా అన్‌ఫెయిర్ ఆడుతున్నాడు కదా భరణి గార్ని చూసి కూడా కొట్టట్లేదంటూ ప్రియ చెప్పుకొచ్చింది.
ఇక భరణి దగ్గరికి సుమన్ శెట్టి వస్తాడు. ఇమ్మాన్యుయల్ ఎమోషనల్ అవుతున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఏంటన్నా నా రీతూ నాకు సపోర్ట్ రావట్లేదు ఆడికి సపోర్ట్ వస్తుంది అంటున్నాడని సుమన్ శెట్టి చెప్పాడు. ఇక కామనర్ల దగ్గర కూర్చొని చేసిన ఘనకార్యాన్ని సపోర్ట్ చేసుకుంటూ రీతూ కామెంట్లు చేసింది. కాదు నేను క్లియర్‌గా స్టాప్ అన్న తర్వాత ఆపేయకపోతే తీసేస్తానని చెప్పా కదా.. స్టాప్ ఎందుకు చెప్పారని అడుగుతారేంటి నాకు అర్థం కాదంటూ రీతూ అంది. మరోవైపు సుమన్ శెట్టితో మాట్లాడుతూ.. ఇమ్మూ ఎమోషనల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి రీతూ వాళ్లనే సపోర్ట్ చేస్తుందన్నా.. నా కోసం ఆడలేదన్నా అంటూ ఇమ్మూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంత టఫ్ ఇచ్చావో తెలుసా నీకు.. మాములు టఫ్ ఇవ్వలేదు నువ్వు అంటూ సుమన్ శెట్టి ఓదార్చాడు.
![]() |
![]() |